మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి పలు అంశాలపైచర్చించడం జరిగింది. కొత్తగూడెం పట్టణంలోని మొర్రేడు వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వనమా విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే కేసీఆర్ స్పందించి కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ముఖ్యమంత్రి అన్నారని వనమా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అనార్హత వేటుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన వనమాకు అనుకూలంగా స్టే రావడంతో కేసుకు సంబంధించిన వివరాలను సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో వివరించారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వనమాతో పాటు తనయుడు వనమా రామకృష్ణ ఉన్నారు.