మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పాల్వంచలోని మహాత్మ జ్యోతిబాపూలే వసతి గృహాన్ని గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆకస్మిక చేశారు. వసతి గృహ పరిసరాలను, కిచెన్ విద్యార్థుల అందిస్తున్న ఆహారపు మెనూను పరిశీలించారు. వసతి గృహ పరిసరాలు అపరిశుభ్రతపై ప్రిన్సిపాల్, వార్డెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైట్లు కూడా సరిగా లేవని ఇంత
అపరిశుభ్రత ఉంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహ నిర్వహణపై ఆర్ సి ఓ తో ఫోన్లో మాట్లాడి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలని విద్యార్థులు చదువుకోడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందని ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహార అందించడం లేదని గమనించిన కలెక్టర్ ప్రిన్సిపాల్ వార్డెన్ కు షో కాజ్ నోటీస్ జారీ చేయాలని ఆర్సీఓను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని మళ్లీ తాను పరిశీలకొస్తానని అప్పట్లోగా మార్పు రాకపోతే విధుల నుంచి సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం హాజరు రిజిస్టర్ పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులను సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వినయశీల తదితరులు పాల్గొన్నారు.