ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం.
మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మెయిన్ రోడ్డు పక్కనే గల చర్చి వెనుకనే ఉన్న ఎస్టీ కాలనీకి సంబంధించిన వరద పోయే కాలువను ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో పునర్ నిర్మించడం జరిగింది. గత నెలలో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా పంచాయతీలోని ఎస్టీ కాలనీ మెయిన్ రోడ్డు పక్కనే గల చర్చ్ పరిసరాలు, ఇండ్లు నీట మునగడం జరిగింది. ఈ సమస్యను రేగా కాంతారావు గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి , ఉపాధ్యక్షులు కటకం గణేష్ , సూచనలతో రేగా కాంతారావు వీరాభిమాని తోగ్గూడెం పంచాయతీకి చెందిన మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్తీ శ్రీలత, ఉప సర్పంచ్ బుస్సీ శ్రీనివాస్ , వార్డు మెంబర్ కల్తి కమలమ్మ స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది.