UPDATES  

 గడప గడపకు గడల 13 నుండి షురూ

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

ఈనెల 13వ తేదీ నుండి గడపగడపకు గుడల కార్యక్రమం ప్రారంభమవుతుందని డాక్టర్
జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శ్రీనగర్ కాలనీ జనహిత కార్యాలయంలో జిఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో గురువారం విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించారు.
మున్సిపల్ వార్డులో గ్రామాల్లో తండల్లో పంచాయితీల్లో గడప గడపకు గడల కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుందన్నారు. జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గడాల శ్రీనివాస్ రావు తో పాటు సభ్యులు సైతం పాల్గొని గడపగడపకు వెళ్లడం జరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోదుగు జోగారావు, బిసి సంఘం నాయకులు సంపత్, సంతు సేవాలాల్ సంఘం మాలోత్ శివ నాయక్, లంబాడ జిల్లా కార్యదర్శి తేజావత్ సతీష్, బిసి వడ్డెర సంఘం నాయకులు ఓర్స్ సాయి కుమార్, తుడుం దెబ్బ నాయకులు వజ్జ వాసు, మైనార్టీ నాయకులు హర్షద్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా నాయకులు కిరణ్ మిట్టపల్లి, అరెళ్ల శ్రీను, అశోక్, శామ్ కుమార్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !