UPDATES  

 పొంగులేటి నహి… బీ. ఆర్. ఎస్ కే జై

పొంగులేటి నహి… బీ. ఆర్. ఎస్ కే జై
* కాంగ్రెస్ కి రిక్త హస్తమే
* కొత్తగూడెం, చర్ల ,మణుగూరులలో
పొంగులేటి సభలు ఫెయిల్
* అధికార బీఆర్ఎస్ పార్టీలో రెట్టింపైన ఉత్సాహం
*రేగా నాయకత్వం పై పూర్తి భరోసా
మన్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార బిఆరెస్ పార్టీ ని ఖతం చేసి కాంగ్రెస్ ని 10 స్థానాలలో గెలిపిస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి శపధం చేశారు. కానీ గురువారం మణుగూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా ఆ పార్టీ అనుకున్నంత స్థాయిలో కార్యకర్తల నుండి స్పందన కరువైంది.ఇటీవలే కొత్తగూడెం, చర్ల లో నిర్వహించిన సభల పరిస్థితి అంతే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్గ పోరు తేటతెల్లమైందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కనీసం వందల సంఖ్యలో కూడా పొంగులేటి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాలేదని సమాచారం. కాగాపినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ పొంగులేటి తొలి పర్యటన అట్టర్ ప్లాఫ్ అవడం పట్ల ఆ పార్టీ అంతర్ మదనం లో పడింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచి అనేక సంక్షేమ పథకాలకి సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవడం,మరోవైపు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వేలకోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు తీసుకురావడం తో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారని బి.ఆర్ఎస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకాలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన కాంగ్రెస్ నాయకులకు పొంగులేటి పర్యటన ఫెయిల్ అవ్వడంతో వారిలో నిరాశ అలముకుంది. అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయింది.
రేగా నాయకత్వం పై పూర్తి భరోసా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నాయకత్వంపై పూర్తి భరోసాతో ప్రజలు, పార్టీ శ్రేణులు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులకుఏ కష్టం వచ్చినా రేగా కాంతరావు వెంటనే స్పందిస్తున్నారు.ఈ నేపథ్యంలో పొంగులేటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కడ సమావేశాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత మైలేజీ రావడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమం, రేగా స్పీడ్ ని తట్టుకోవడం వారికి కష్టంగా మారింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !