UPDATES  

 ప్రజల ఆరోగ్యంతో “నిక్షిత రెస్టారెంట్” చెలగాటం!

ప్రజల ఆరోగ్యంతో “నిక్షిత రెస్టారెంట్” చెలగాటం!
మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో యాజమాన్యంపై ఫిర్యాదు
నిల్వ ఉన్న కలుషిత ఆహారంను చూసి కంగుతిన్న బాధితులు
కలవర పెట్టిన పెరుగులో పురుగులు
రెస్టారెంట్లపై ఫుడ్ ఇన్స్పెక్టర్ నిఘా కరువు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని లేపాక్షి రహదారిలో ఉన్న నిక్షిత రెస్టారెంట్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుందని అసహనం వ్యక్తం చేస్తూ ఒక వ్యక్తి నేరుగా శుక్రవారం కొత్తగూడెం మూడవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. టేకులపల్లి మండలంకు చెందిన లక్ష్మణ్ రావు తో పాటు అతని ఇద్దరు స్నేహితులు పని నిమిత్తం కొత్తగూడెంకు రావడం జరిగింది. వారు పని ముగించుకొని భోజనం చేద్దామని పట్టణంలోని లేపాక్షి రూట్ లో ఉన్న “నిక్షిత రెస్టారెంట్” కు వెళ్లారు. చేతులు కడుక్కొని టేబుల్ మీద కూర్చున్న లక్ష్మణ్ రావుతో పాటు మరో ఇద్దరు స్నేహితులు బిర్యానిని ఆర్డర్ చేశారు. మూడు నిమిషాల తర్వాత వడ్డించేవారు బిర్యానీతో పాటు పెరుగు పచ్చడిని తీసుకొచ్చే టేబుల్ మీద పెట్టారు. ఆ ముగ్గురు బిర్యానీని తిన్న తర్వాత చివరి దశలో పెరుగు పచ్చడినీ వేసుకుందామని చూసేసరికి అందులో తెల్లటి పురుగులు జలకలాడుతున్నాయి. వాటిని చూసిన లక్ష్మణ్ స్నేహితులు ఆందోళన గురై యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరిగింది. యాజమాన్యం సమస్యను లైట్ గా తీసుకోవడంతో లక్ష్మణ్ రావు అనే వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి నిక్షిత రెస్టారెంట్ యాజమాన్యంపై ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !