- పార్థివదేహాన్ని పరామర్శించిన రేగా కాంతారావు.
- డెంగ్యూ జ్వరంతో క్రికెటర్ మృతి.
- డేంజర్ జోన్లో డెంగ్యూ.
జ్వరాల,పల్లి గ్రామపంచాయతీ.
మన్యం న్యూస్ బూర్గంపహాడ్:-
పార్థివదేహాన్ని పరామర్శించిన రేగా.
శుక్రవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామానికి చెందిన పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ విభాగం అధ్యక్షులు రేగా వీరాభిమాని,బిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు వెన్న రంజిత్ కుమార్ డెంగ్యూ జ్వరంతో మరణించడంతో విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొని పార్ధివదేహాన్ని సందర్శించి,పూలమాల వేసి నివాళులర్పించి,అనంతరం బాధిత కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు,పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
డెంగ్యూతో క్రికెటర్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బిఆర్ఎస్ యువజన నాయకుడు వెన్న రంజిత్ కుమార్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ శుక్రవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ యువకుడికి క్రికెట్ అంటే ప్రాణం ఈ యువ క్రీడా కారుడు అశ్వపురం నుండి ఓ క్రికెట్ జట్టును తయారు చేసి దానికి జేమిని 11 అని నామకరణం చేసి ఈ జట్టుకు కెప్టెన్ గా అధ్యక్షత వహిస్తూ ఈ జట్టును ముందుకు నడిపే వాడు ఈ క్రమంలో ఈ అభిమాన క్రికెటర్ శుక్రవారం ఉదయం డెంగ్యూ జ్వరంతో చనిపోవడంతో విషయం తెలుసుకున్న ఆ జట్టు సభ్యులతో పాటు జిల్లాలో పలు క్రికెట్ జట్ల క్రీడాకారులు,మండల యువత ఒక్కసారిగా మూగపోయారు,ప్రణ స్నేహితులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు.ఇగ భద్రాద్రి ప్రజల్లో రోజు,రోజుకీ డెంగ్యూ భయం ఎక్కువైపోతుంది,భద్రాద్రి జిల్లాలో ఈ వైరస్ నోటి కోరల్లో ప్రజలు చిక్కుకున్నట్టు ప్రజలు గడియ,గడియ గుబులు పడుతున్నారు,పలు గ్రామాల్లో వందల మంది ప్రజలు విషజ్వరబాధితులవుతున్నారు,అధికార లెక్కలు కొన్ని ఐతే,అనధికారిక లెక్కలు మరి కొన్ని అని విశ్లేషకుల లెక్కలు చెబుతున్నాయి.
డేంజర్ డెంగ్యూ.
వర్షాకాలంలో ప్రజలకు జ్వరాలు దగ్గు జలుబు ఇలాంటి రోగాలు రావడం సర్వసాధారణం,అయినప్పటికీ జ్వరంలో పలు రకాలు ప్రభలుతుంటాయి,టైఫాయిడ్,మలేరియా,చికెన్ గునియా,డెంగ్యూ,వైరల్ వంటి పలు రకాల జ్వరాలు ప్రవలుతుంటాయి,వైరల్ ఫీవర్ల కోరల్లో చిక్కుకోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న జ్వర బాధితులు
పలుగ్రామాల్లో ప్రబలుతున్నప్పటికి,పలు వసతి గృహాల్లో విద్యార్థులకు ఎక్కువగా ఈ జ్వరం ప్రభలిందని విశ్వనియత సమాచారం.ఈ జ్వరంలో ప్రధాన జ్వరం డెంగ్యూ ఇట్టి జ్వరం ప్రభలిన వ్యక్తి ఇంచుమించు స్వర్గం వరకు వెళ్లి వస్తారని ప్రజలు అంటూ ఉంటారు,నిజంగా ఇట్టి జ్వరం అలానే ప్రవర్తిస్తున్నది,ఇప్పటికే జిల్లాలో ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్న ఈ డేంజర్ డెంగ్యూ కారణంగా ప్రజలు గజగజ వనికి పోతున్నారు.
జ్వరాల,పల్లి.
బూర్గంపహడ్ మండలంలోని సోంపల్లి అనే గ్రామంలో ప్రజలు విష జ్వరాలతో ఉక్కిరి,బిక్కిరి అవుతున్నారు,విష జ్వరాలతో వనికి పోతున్నారు,ఇప్పటికే గ్రామంలో 200 మందికి పైగా జ్వరం ప్రబలినట్టు విస్వానియత సమాచారం,అధికారికంగా ప్రస్తుతం గ్రామానికి చెందిన సుమారు 60 మంది జ్వరాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం,వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న ప్రజలు వారి యొక్క జ్వరాల సంఖ్య లెక్క లేకుండా పోతున్నది,ఒక్కో ఇంట్లో ఇద్దరు,ముగ్గురు బాధితులు ఉండటం ఇట్టి జ్వర సమస్య తీవ్ర స్థాయి ఇబ్బందికి చేరింది,జిల్లా అధికార యంత్రాంగం ముందుగా ఉలిక్కి పడి ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేపట్టారు.ఐనా జ్వరాలు తగ్గు ముఖం
పట్టకపోవడంతో,దీంతో చేసేదేమీ లేక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వర బాధితులకు వైద్యం అక్కడే అందిస్తున్నారు,ప్రస్తుతం గ్రామ పంచాయతీ జ్వరాల,పల్లిగా మారింది.