మన్యం న్యూస్ భద్రాచలం:-భద్రాచలం రెవెన్యూ డివిజనల్ నూతన అధికారిగా మాలోత్ మంగీలాల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆయన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్లో ఎస్డిసి గా విధులు నిర్వహిస్తూ ఆర్డీవోగా పదోన్నతిపై వచ్చి నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు.అనంతరం భద్రాచలంలోని 41 పోలింగ్ స్టేషన్లు ఆయన పరిశీలించి త్వరలో ఎన్నికలు వస్తున్నందున వికలాంగులకు,వృద్ధులకు ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని ముఖ్యంగా వికలాంగుల కొరకు ప్రతి పోలింగ్ స్టేషన్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కరెంటు మరియు మంచినీటి సౌకర్యం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిటి రమేష్ మరియు సంబంధిత తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.