UPDATES  

 మైనర్ బాలికలను వేధిస్తున్న ఇద్దరు యువకులపై కేసు నమోదు

 

మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మైనర్ బాలికల వెంటపడి ఎకిలి చేష్టలు చేస్తూ, వేధిస్తున్న ఇద్దరు యువకులపై ఫోక్సో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను నర్సాపురం గ్రామానికి చెందిన షేక్ ఆరిఫ్ తండ్రి అజిత్ అనే యువకుడు కాలేజీకి వెళ్తుండగా మార్గమధ్యలో అడ్డగించి తనతో రావాలంటు, రాకపోతే గతంలో దిగిన ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరించి, భయపెట్టి బలవంతంగా తన బైక్ పై ఎక్కించుకొని, జూలూరుపాడులో గల తన స్నేహితుడు ఇంటికి తీసుకుపోయి తన సెక్స్ కోరికలు తీర్చమంటూ, యువతిని ఇబ్బందులకు గురిచేసి, సెక్స్ కోరికలు తీర్చకపోతే అంతు చూస్తానని బెదిరించి, తన వద్ద ఉన్న బ్లేడ్ తో యువతి మెడపై కోసే ప్రయత్నం చేయగా, సదరు యువతీ తప్పించుకునే ప్రయత్నంలో మెడ వద్ద స్వల్ప గాయం అయినదని, ఎలాగోలా ఆరిఫ్ వద్ద నుండి తప్పించుకొని, ఇంటికి చేరుకుని జరిగిన విషయం తన తల్లిదండ్రులకు తెలియపరిచి, వారు ఇచ్చిన ధైర్యంతో స్టేషన్ కు వచ్చి తనను గత కొంత కాలంగా ప్రేమించాలని వెంటపడుతూ వేధిస్తూ, కాలేజీకి వస్తున్న క్రమంలో అడ్డగించి తన బైక్ పై ఎక్కించుకొని తన కోరికలు తీర్చాలంటూ ఇబ్బందులకు గురిచేసి, దాడి చేసి గాయపరిచిన సదరు షేక్ ఆరిఫ్ ఫై చట్ట రీత్యా చర్య తీసుకోవలె నన్న బాధిత మైనర్ యువతి ఫిర్యాదు చేసిందని, అదే విధంగా మండలానికి చెందిన మరో మైనర్ బాలికను నరసాపురం గ్రామానికి చెందిన షేక్ లతీఫ్ పాషా అనే యువకుడు 09-08-23న సదరు యువతి కాలేజీకి వెళ్తుండగా మార్గమధ్యంలోని సాయిరాం తండా వద్ద అడ్డగించి తనతో రాకపోతే సంపుతానని బెదిరించి భయపెట్టి బైకుపై ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతూ ప్రేమించమని వేధిస్తూ, కౌగిలించుకోమని కోరికలు తీర్చమని వేధిస్తుండగా బాధిత యువతి గట్టిగా కేకలు వేసి ఏడ్చి అరవగా లతిఫ్ భయపడి ఆమెను తినోబా నగర్ గ్రామ శివారుణ దింపి, ఈ విషయం ఎవరికైనా చెబితే యువతి తో పాటు వారి తల్లిదండ్రులను చంపుతానని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశాడని, అలోగల అక్కడనుండి తప్పించుకొని ఇంటికి చేరి జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలియపరచి, తనను ప్రేమించమని వెంటపడుతూ వేధిస్తూ, బలవంతంగా బైకుపై ఎక్కించుకొని తన కోరికలు తీర్చమంటూ ఇబ్బందులకు గురిచేసిన లతీఫ్ భాష పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదు పై జూలూరుపాడు ఇంచార్జ్ ఎస్సై ఎస్డి షాహినా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !