UPDATES  

 గిరిజన చేపల సొసైటీ నూతన అధ్యక్షులు గా వంక.అర్జున్ రావు

 

మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 11

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం లోని కూనవరం గ్రామ పంచాయతీ లో జరిగిన గిరిజన చేపల పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో అధ్యక్షులు గా వంక.అర్జున్ రావు,ఉపాధ్యక్షులు గా ఏనిక. కామరాజు,కార్యదర్శి గా ఎలిబోయిన.కృష్ణ,ఎన్నికయ్యారు.వీరితో పటు ఆరుగురు పాలక వర్గ సభ్యులు ను ఎన్నుకోవడం జరిగింది.ఎన్నికల అధికారి ఏ.యస్.ఆర్.హనుమాన్ సీనియర్ ఇన్స్పెక్టర్ జిల్లా సహకార అధికారి ఆధ్వర్యంలో ఈ ఎన్నిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నూతన పాలక వర్గ అధ్యక్షులు,కార్యదర్శి,సభ్యులను కూనవరం సర్పంచ్ ఏనిక.ప్రసాద్,ఎంపిటిసి గుడిపూడి.కోటేశ్వరరావు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యాక్రమం లో బిఆర్ఎస్ స్థానిక నాయకులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !