- అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ విప్ రేగా కాంతారావు
- 100 పడకల ఆసుపత్రిలో అభివృద్ధి పనులను పరిశీలించిన యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్
మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 12
మణుగూరు మండలం లోని వంద పడకల ఆసుపత్రిలో జరుగుతన్న అభివృద్ధి పనులను బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్ స్థానిక నాయకులు,యువజన నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా సాగర్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రతేక్య కృషి తో వంద పడకల ఆసుపత్రి లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యాలమాలకు నిధులు కేటాయిస్తూ,జిల్లా లోనే నెంబర్ వన్ గా మారుస్తున్నారు అని తెలిపారు.అత్యాధునిక సదుపాయాలు,పరికరాలను ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు అన్నారు.జిల్లాలోనే ఇప్పటి వరకు జరగని ఆరుదైన ఆపరేషన్ లను మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతం గా నిర్వహించడం జరుగుతుంది అన్నారు.ఇటీవలే ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం,బ్లడ్ స్టోరేజి యూనిట్ లను విప్ రేగా కాంతరావు ప్రారంభించారు అని చేశారు.దూరప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స కోసం వస్తున్న ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విప్, రేగా కాంతారావు ప్రత్యేక దృష్టి తో హాస్పటల్ నందు నూతన సీసీ ప్లాట్ ఫారం అలాగే గ్రీనరిని ఏర్పాటు చేస్తు,చికిత్స కోసం వస్తున్న పజలకు మంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు,సిద్దేల తిరుమలరావు,యువజన నాయకులు,బొయిళ్ల రాజు, డేగల సంపత్ కుమార్,సునీల్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.