మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 12
సింగరేణి ఉద్యోగం జీవితానికి గొప్ప మలుపు అని సింగరేణి జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ తెలిపారు. మణుగూరు ఏరియా సింగరేణి లో పని చేస్తూ,మెడికల్ ఇన్వలిడేట్ అయిన 7 మంది ఉద్యోగులకు వారి కుటుంబాల కు చెందిన 7 మంది అభ్యర్ధులకు మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ జిఎం కార్యాలయంలో కారుణ్య నియామకం క్రింద 7 మందికి సింగరేణి లో ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్మా ట్లాడుతూ,సింగరేణి వంటి గొప్ప సంస్థలో ఉద్యోగం దొరకడం గొప్ప అదృష్టమే కాదు,జీవితానికి గొప్ప మలుపు అని తెలిపారు.సింగరేణి ఉద్యోగి ప్రత్యక్షంగా సంస్థ అభివృద్ధికి,తన కుటుంబ పోషణకేకాక పరోక్షంగా రాష్ట్ర ప్రగతికి కూడా దోహదపడుతారు అని,ఎంతో నిబద్ధత గల ఉద్యోగిగా పేరు పొంది,ఉద్యోగ విరమణతో వచ్చే లక్షల రూపాయల కంటే తమ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం అని భావించి,మీకు ఉద్యోగ అవకాశం కలిపించిన తల్లిదండ్రుల గొప్ప మనస్సుని స్ఫూర్తిగా తీసుకొని,రక్షణ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ,సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలి అన్నారు.అలాగే కన్నవారికి కూడా ఏలోటూ రాకుండా చూసుకోవాలని జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం వీసం కృష్ణయ్య,ప్రాజెక్ట్ అధికారి ఎంఎన్ఐఓసి శ్రీనివాస దారి, అధికార ప్రతినిధి డిజిఎం పర్సనల్ సలగల రమేశ్, టిబిజికెఎస్ బ్రాంచ్ సెక్రటరీ వి.ప్రభాకర్ రావు,సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్,జూనియర్ ఆసిస్టంట్ రేపాక ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.