- డెంగీ డేంజర్
- జిల్లాను గడగడలాడిస్తున్న జ్వరాలు
- ఇప్పటికే మహమ్మారికి ముగ్గురు బలి
- జ్వరాల బారిన వందలాది మంది
- కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
మన్యంన్యూస్, బూర్గంపహాడ్, అశ్వాపురం:
డెంగీ జ్వరాలతో జిల్లా అతలాకుతలం అవుతోంది. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాల్లో డెంగీకాటుకు మరణిస్తున్నారు. అశ్వాపురంలో ఇద్దరు చనిపోగా, గుండాల మండలంలో శనివారం మరొకరు చనిపోయారు. వర్షాకాలంలో ప్రజలకు జ్వరాలు, దగ్గు, జలుబు ఇలాంటి రోగాలు రావడం సర్వసాధారణం. వైరల్ ఫీవర్ కోరల్లో చిక్కుకొని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న జ్వర బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పలుగ్రామాల్లో ప్రబలుతున్నప్పటికి,పలు వసతి గృహాల్లో విద్యార్థులకు ఎక్కువగా ఈ జ్వరం ప్రభలిందని విశ్వసనీయ సమాచారం. డెంగీ జ్వరం అనేరమందిని పొట్టనపెట్టుకుండడంతో ప్రజలు గజగజలాడుతున్నారు.
పూరిగుడిసెల్లోనే పోతున్న ప్రాణాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెంగ్యూ మహన్మారి ఈ ఏడాది “విష”కోరలు చాపింది అని చెప్పుకోవచ్చు,జిల్లాలో ఈ ఏడాది ఎక్కవగా నమోదు అవుతున్న విష జ్వరాలు,ఈ జ్వరాల్లో ఎక్కువ శాతం డెంగ్యూ జ్వరాలు ప్రబలి ఆసుపత్రుల్లో అనేకమంది ప్రాణాలు విడుస్తున్నారు. అమాయకత్వంతో ఆస్పత్రిలో వైద్యం కూడా చేయించుకోలేని పేద ప్రజలు జ్వరాలతో మగ్గి,మగ్గి పురి గుడిసెల్లోనే ప్రాణాలు వదులుతున్నారు. దీనిపై అధికారయంత్రాంగం ప్రత్యేకశ్రద్ద పెట్టాలి.