గృహలక్ష్మి రెడీ
….
దరఖాస్తుల విచారణ ప్రక్రియకు అధికారులు సన్నద్ధంగా ఉండాలి
….
జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
.. Update..
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
గృహలక్ష్మీ పథకానికి దరఖాస్తులు స్వీకరణకు గడువు ముగిసినందున విచారణ ప్రక్రియకు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శనివారం గృహలక్ష్మీ దరఖాస్తులు విచారణ ప్రక్రియ నిర్వహణపై అన్ని శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో అర్హుల జాబితా రూపకల్పనలో పాటించాలిసిన మార్గదర్శకాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల
20వ తేది నాటికి వచ్చిన దరఖాస్తులు ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నదని యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. విచారణ ప్రక్రియ పర్యవేక్షణ అన్ని మండలాల ప్రత్యేక అధికారులు పరిశీలన చేయాలని చెప్పారు.
విచారణ తదుపరి ఆర్డిఓలు ధ్రువీకరణతో జాబితా నివేదికలు అందచేయాలని చెప్పారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, జడ్పి సీఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలు శిరీష, మంగిలాల్, అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు,
తహసీల్దార్లు, ఎంపిడివోలు, ఎంపివోలు తదితరులు పాల్గొన్నారు.