- కోట్ల నిధులతో కొత్తగూడెం అభివృద్ధి
- 15ను తర్వాత మరి కొన్ని పనులకు శంకుస్థాపనలు
- ప్రారంభోత్సవాలు
- కొత్తగూడెం అభివృద్ధికి 115 కోట్లు
- పాల్వంచ పట్టణానికి 100 కోట్లు
- అంబేద్కర్ భవనాలకు కోటి 50 లక్షలు
- మండలాల అభివృద్ధికి 96కోట్లు
- ముర్రేడు వాగు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 33 కోట్లు
- ప్రజల సంక్షేమం కోసం రోజుకు 18 గంటలు పని చేస్తా
- విలేకరుల సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని కోట్లు అయినా ఇస్తానని సీఎం కేసీఆర్ తనకు స్వయంగా హామీ ఇవ్వడం జరిగిందని దీనిలో భాగంగా అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని కొత్తగూడెంపై కేసీఆర్ కు అమితమైన ప్రేమ ఉందని అందుకే నిధుల వరద కురిపిస్తున్న కెసిఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వనమా మాట్లాడుతూ కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలో అభివృద్ధి కొరకు 215 కోట్లు మంజూరయ్యాయని స్వాతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత రోజు నుండి శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి సుజాతనగర్, పాల్వంచ మండలాల అభివృద్ధికి 96 కోట్ల నిధులు మంజూరు కావడం జరిగింది అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్తగూడెం ముర్రేడు వాగుకు రెండువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 33 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. అదేవిధంగా కొత్తగూడెంలోని అంబేద్కర్ భవనానికి ఒక కోటి రూపాయలు, పాల్వంచలో అంబేద్కర్ భవనానికి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయని వీటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పాల్వంచలో ఇప్పుడున్న 50 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలోనే హెల్త్ మినిస్టర్ హరీష్ రావును, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ ను తీసుకువచ్చి 100 పడకల హాస్పిటల్ కు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 25 కిలోమీటర్ల దూరంలో సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేసి కొత్తగూడెంలో వెలుగులు నింపడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వేల కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పనులు జరుగుతున్నాయని చెప్పారు. కొన్ని అవంతరాలతో పనులు ప్రారంభించలేకపోయినట్లు తెలిపారు. ఇకనుండి అభివృద్ధికి ప్రతిరోజు 18 గంటలు పని చేస్తానని అన్నారు. ఎన్ని అవంతరాలు వచ్చినా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల నుంచి దూరం కానన్నారు. ప్రజలందరూ సహకరిస్తే కొత్తగూడెం నియోజకవర్గం నెంబర్ వన్ గా మారుస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సూపర్ ఫాస్ట్ లాగా ముందుకు పోతుందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి కూడా అదే తరహాలో ముందుకు పోతుందని వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, సొసైటీ చైర్మన్ మండే
వీరహనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.