UPDATES  

 ఆయుర్వేదం ప్రకారం వేపాకుతో కంట్రోల్ లో షుగర్ వ్యాధి!

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. గతంతో పోల్చితే ఇప్పుడు కొన్ని వందల రెట్లు షుగర్ వ్యాధి పేషెంట్ సంఖ్య పెరిగింది.
షుగర్ వ్యాదిగ్రస్తులు ప్రతి రోజు ట్యాబ్లెట్ లేదా ఇన్సులిన్‌ ఇంజక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకోని పక్షంలో వారి షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగి పోయి చివరకు వారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి రోజు వారు ఇన్సులిన్‌ తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. షుగర్‌ లెవల్స్ ను ఒక స్థాయిలో ఉండేలా చేయడంలో మన చుట్టు పక్కల ఎన్నో పదార్థాలు ఉపయోగ దాయకంగా ఉంటాయి.

అందులో వేపాకు ఒకటి అంటూ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద నిపుణుల సూచన మేరకు వేపాకు ను 45 రోజుల పాటు తీసుకోవడం వల్ల 99 శాతం మందిలో షుగర్‌ లెవల్స్ కంట్రోల్‌ లో ఉంటాయని అంటున్నారు. షుగర్‌ ఉన్న వారు చేయవల్సిందల్లా ఉదయానే పరిగడుపున వేప చెట్టు లేత ఆకులు మూడు లేదా నాలుగు నమిలి మింగాలి. ఆ తర్వాత కనీసం గంట సమయం బ్రేక్‌ ఇచ్చి టీ లేదా ఇతర పదార్థాలు ఏమైనా తీసుకోవాలి.

ఖచ్చితంగా వేప ఆకులు తిన్న తర్వాత కనీసం గంట గ్యాప్‌ ఇవ్వాల్సిందే అంటున్నారు. అందుకే లేచిన వెంటనే వేప ఆకులు తిని ఆ తర్వాత బ్రష్‌ చేసుకోవడం.. ఆ తర్వాత టీ టిఫిన్ చేయడం మంచిది. వేప ఆకు ను నమిలి మింగడం ఇబ్బందిగా అనుకున్న వారు గుప్పెడు ఆకులను తీసుకుని బాగా మరుగుతున్న నీటిలో వేసి మరో అయిదు నిమిషాల పాటు ఆ నీటిని మరిగించి ఆ తర్వాత వడగట్టి ఆ నీటిని చల్లార్చుకుని తాగాలి. అలా ప్రతి రోజు ఉదయం సాయంత్రం కలిపి లీటరు నీళ్లు తాగాలి. రెండు నెలలు కంటిన్యూగా వేప నీళ్లు తాగడం వల్ల షుగర్‌ వ్యాది సమస్యల నుండే కాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుండి కూడా పరిష్కారం లభిస్తుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !