UPDATES  

 ఆదివాసి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి

  • ఆదివాసి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి
  • పాఠశాలల నిర్మాణాలకు అటవీ శాఖ అధికారులు సహకరించాలి
  • ఐఎఫ్ టియు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు.

మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 13

ఆదివాసి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని,పాఠశాలల నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టించకూడదని ఐఎఫ్ టియు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఆగస్టు 9 నుండి 15 వరకు అంతర్జాతీయ ఆదివాసి హక్కుల సాధన వారోత్సవాలు నిర్వహించాలని ఆదివాసీలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని,పరిష్కారం అయ్యేలా చూడాలని న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మణుగూరు ఏరియా ఐఎఫ్ టియు బృందం మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరిధిలోని సింగరేణి నిర్వాసిత ఆదివాసి పెద్దిపల్లి గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. గ్రామస్తులతో కొద్దిసేపు ముచ్చటించారు.వారు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారు గ్రామస్తులతో కలిసి మాట్లాడుతూ,పెద్దిపల్లి గ్రామానికి రోడ్లు ఇతర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా,అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు.గ్రామంలో పాఠశాల నిర్మాణానికి సింగరేణి ఉద్యోగులు ఆర్థిక సహకారం ఇవ్వడానికి ముందుకు వచ్చినా కూడా,ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో పాఠశాల నిర్మాణం కూడా నిలిపివేశారని పిల్లలు ఆగమైపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసారు.ఆదివాసీ విద్యార్థిని విద్యార్థుల చదువుకు ప్రోత్సహించాల్సిన ప్రభుత్వ శాఖలే ఇలా వ్యవహరించడం సరికాదని వారు తెలిపారు.పినపాక నియోజకవర్గం పరిధిలోని ఆదివాసి గిరిజన గ్రామాలు పెద్దిపల్లి తో పాటు కొండాపురం, కొమ్ముగూడెం,బుగ్గ, ఖమ్మం తోగు, బుడుగుల,రేగుల గండి సర్వాయి గుంపు రాయన్నపేట కుమ్మరి గుంపు కొత్త గుంపు, మనుబోతుల గూడెం తదితర గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకించి విద్యుత్ ,రహదారి, త్రాగునీటి సౌకర్యం పాఠశాలల నిర్మాణం తదితర సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ,తమ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ కు,రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు వినతి పత్రాలు అందజేసినట్లు మిడిదొడ్ల నాగేశ్వరరావు తెలిపారు,వేసవిలో గుక్కెడు మంచినీళ్లు దొరక్క ఆదివాసీలు అనేక ఇబ్బందులు పడ్డారని,ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సిఎస్ఆర్ నిధులతో పెద్దిపల్లి గ్రామ అభివృద్ధికి విధులు మంజూరు చేసేలా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్,ఐటీడీఏ పిఓ లు స్పందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు అంగోత్ మంగీలాల్,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అశ్వాపురం మండల కార్యదర్శి సాధన పల్లి రవి,పెద్ది పల్లి గ్రామపెద్ద మడకం బాబురావు,గ్రామస్తులు మడకం రాజు,ఉంగయ్య,బాడిస జోగయ్య,బాడిస మంగయ్య,నూపా ఐతయ్య కణితి దేవయ్య,చీమల భీమయ్య,మడకం పెద్ద సోమయ్య, కారం దేవయ్య ,వెట్టి జోగయ్య ,తాటి నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !