UPDATES  

 నలుగురు నిషేధిత మావోయిస్టు పార్టీ కొరియర్లు అరెస్టు.. 20 లక్షల నగదు, పేలుడు పదార్థాలు, కారు స్వాధీనం..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఆగస్టు 12::
నలుగురు మావోయిస్టు పార్టీ కొరియర్లు అరెస్ట్ చేసిన పోలీసులు వారు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని గౌరారం గ్రామ శివారులో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేశవ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో పైడిగూడెం గ్రామం వైపు నుంచి పెద్ద నల్లబెల్లి సెంటర్ వైపు ఏపీ 05 ఈడి 2543 నెంబర్ గల కారు పోలీసు వారిని చూచి ఆపకుండా వెళ్ళిపోతున్న నేపద్యంలో స్థానిక పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన వారు నిషేధిత మావోయిస్టు కొరియర్లు అని విచారణలో తేలింది. పట్టుబడిన వారిలో ఆంధ్రప్రదేశ్ చెందిన కుంజా రఘువరన్, పులిపాటి రవితేజ, చతిస్గడ్ చెందిన బైరెడ్డి సతీష్, దినేష్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. వీరి వద్దనుండి 20 లక్షల నగదు, జిలేటింగ్ స్టిక్, కార్డెక్స్ వైరు, డిటోనేటర్, రౌండ్స్ 02 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు నిశిదిత మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా ఉంటూ పోలీస్ క్యాంపులపై దాడి చేయడానికి పేలుడు పదార్థాలు పట్టుకొని వెళ్తున్నారని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ వినీత్ జి మాట్లాడుతూ నిషేధిత మావోయిస్టు పార్టీ వారికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరైనా సహాయం చేసినట్లయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే స్థానిక పోలీస్ శాఖ వారికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పి పంకజ్ పరితోష్, అడిషనల్ ఎస్పీ సాయి మనోహర్, ఇన్స్పెక్టర్ దోమల రమేష్,ఎస్సై కేశవ్,సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రీత, చౌరాసియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !