UPDATES  

 చేతివృత్తిదారుల అభివృద్ధి కేసీఆర్ లక్ష్యం

  • చేతివృత్తిదారుల అభివృద్ధి కేసీఆర్ లక్ష్యం
  • ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే కెసిఆర్ తపన
  • బీసీ బందు రుణ సహాయం దశలవారీగా ఉంటుంది
  • బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కునే దమ్ము ఏ పార్టీకి లేదు
  • బీసీ రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
  • 300 మంది లబ్ధిదారులకు 3 కోట్లు పంపిణీ

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
చేతివృత్తిదారుల అభివృద్ధి చెందాలన్నదే కేసీఆర్ లక్ష్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో పలు రకాల సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువస్తూ వాటిని విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనకు తిరుగులేదని అంతేకాకుండా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము ఏ పార్టీకి లేదన్నారు. ఆదివారం స్థానిక కొత్తగూడెం క్లబ్ లో చేతివృత్తిదారులకు ఆర్థిక సహాయం బీసీ బందు రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ చేతి వృత్తుదారుల కుటుంబాలు సంతోషంగా ఆర్థికంగా ఎదగాలని లక్ష్యంతో బీసీ రుణ పథకాన్ని కెసిఆర్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆర్థిక సాయం అందించే దశలో ఇది ఆరంభం మాత్రమేనని ఈ ప్రక్రియ దశలవారీగా ముందుకు సాగుతుందన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఒక లక్ష రూపాయలను ఇస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో 300 మంది కులవృత్తిదారులకు మూడు కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి కొరకు కేసిఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పథకాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. త్వరలో గుడి లేని పేద కుటుంబానికి గూడు కల్పించాలని లక్ష్యంతో గృహ లక్ష్మీ పథకం అమలు కాబోతుందన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బీసీ బందు పథకం అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది: కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
బిసి కులవృత్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన బీసీ బందు పథకం బిసిల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అన్నారు. తొలి విడతలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారి అభివృద్ధికి ఇదొక మంచి పథకం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్,
జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, సొసైటీ చైర్మన్ మండే
వీరహనుమంతరావు, ఎంపీపీలు బాదావత్ శాంతి, సోనా, విజయలక్ష్మి, వార్డు కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, రుక్మాంధర్ బండారి, పంచాయతీల సర్పంచులు, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, ఎస్సి కార్పొరేషన్ ఈ డి సంజీవరావు, మున్సిపల్ కమిషనర్ రఘు, ఎంపీడీవోలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కెసిఆర్ వనమా చిత్రపటాలకు పాలాభిషేకం..
బిసి రుణాల చెక్కులను అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ వారు కొత్తగూడెం క్లబ్ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కెసిఆర్ ఏ మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని వారికి అండగా మేమంతా ఉంటామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు శాంతి, సోనా, విజయలక్ష్మి, వార్డ్ కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !