- బిఆర్ఎస్ పరిపాలనలో సంక్షేమం లో స్వర్ణయుగం
- అభివృద్ధి లో తెలంగాణ దేశం లోనే నెంబర్ వన్.
- హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్ష్యం.
- మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు
మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 13
మణుగూరు మండల పరిధి లోని తోగ్గుడేం గ్రామ పంచాయతీ లో జడ్పీటీసీ పోశం నరసింహారావు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సందర్బంగా జడ్పీటీసీ పోశం నరసింహారావు మాట్లాడుతూ,పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ప్రతేక్య కృషి తో గ్రామాలూ,పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు. ప్రభుత్వ పధకాలను అద్భుతంగా అమలు చేస్తూ, జిల్లా లోనే నంబర్ వన్ గా నిలిపారన్నారు.మన తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని,రైతులకు రైతు బంధు,రైతు భీమా,24 గంటల ఉచిత కరెంట్ ఇస్తూ,రైతులకు అండగా నిలిచిందన్నారు. రైతులకు రుణమాఫీ చేసి రైతుల పాలిట ఆపద్బాంధవుడు మన సీఎం కెసిఆర్ చరిత్ర సృష్టించారు అని తెలిపారు.సంక్షేమం లో స్వర్ణ యుగాన్ని తలపించేలా పథకాలను అమలు చేస్తున్న ఏకైక పభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని గృహలక్ష్మి, దళిత బందు,గొర్రెల పంపిణీ, బీసీ బందు,మైనారిటీ 1 లక్ష రూపాయిలు ఆర్ధిక సాయం, కళ్యాణ లక్ష్మి,షాది ముభరక్, సీఎం రిలీఫ్ ఫండ్,నుట్రిషన్ కిట్,అమ్మఒడి,కంటి వెలుగు, అసరా పింఛన్లు,ధరణి,వంటి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని తెలియజేశారు.తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుంది అన్నారు గత పాలనలో ఎవరు చేయనటువంటి విధంగా మన నియోజకవర్గం లో వందల కోట్ల రూపాయల తో అత్యంత అద్భుతంగా నియోజవర్గం గా తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యే రేగా కాంతారావు కే దక్కుతుంది అన్నారు.ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలను, గ్రామస్తులకు వివరిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో మూడోవ సారి వందకి,వంద శాతం సీఎం కెసిఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది అని, పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే రేగా కాంతారావు భారీ మెజారిటీతో గెలుస్తారు అని ధీమా వ్యక్తం చేశారు. గెలుపే లక్ష్యం గా ప్రతి ఒక్కరూ పనిచేయాలి అని నాయకులు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో తోగ్గుడేం సర్పంచ్ బోగ్గం రజిత, పద్దం శ్రీనివాస్,మట్టపల్లి సతీష్, గుగులోత్ రమేష్,సత్యవతి, మంగ,గోవింద శ్రీను, వీరాస్వామి,రమణారెడ్డి,సాయి ప్రకాష్,భద్రం,రాజు,సునీల్ కుమార్,సంపత్ కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.