UPDATES  

 కొరస ఆనంద్ కాంగ్రెస్ కి గుడ్ భై?!

*పార్టీ మారే యోచనలో కొరస
*పాయం వర్గం అవమాన పరుస్తున్నారని అనుచరుల ముందు ఆవేదన వెలుబుచ్చిన ఆనంద్
* పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం
* ఆనంద్ బాటలో వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు
* బీ. ఆర్.ఎస్, బీజేపీ వైపు చూపు
మన్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నానాటికి ఉదృతం అవుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక ముఖ్య నాయకుడి ధోరణి మూలంగా అనేకమంది కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. పాత తన అనుచర గణాన్ని దగ్గరకు తీసుకొని సీనియర్ కాంగ్రెస్ నాయకులను, యువకులను పక్కకు పెడుతున్నారని ప్రధాన ఆరోపణ. ఇన్ని అవమానాల నడుమ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేవని భావించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేరే పార్టీలవైపు తొంగి చూస్తున్నారు. ఈ బాటలో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు వరస ఆనంద్ ముందువరుసలో ఉన్నట్లు అత్యంత విశ్వాసనీయ సమాచారం. ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండటమే కాకుండా లక్షల రూపాయలు ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతం చేసి పార్టీలో కొనసాగినప్పటికీ తాజా పరిణామాలతో తన రాజకీయఉనికి కోల్పోవడం తనని తీవ్ర నిరాశకు గురిచేస్తుందని, ఈ నేపథ్యంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు తన అనుచరుల ముందు కొరస ఆనంద్ వాపోయినట్లు సమాచారం. ఆయనతోపాటు వందలాది మంది కార్యకర్తలు వేరే ఇతర పార్టీలు బీ. ఆర్.ఎస్,బీజేపీ పార్టీ లలోకి మారడం ఖాయమని సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టీరింగ్ ఖమ్మం జిల్లాలో ఉండడంతో ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని, హస్తం పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ సమాధి ఖాయం అని కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు చర్చించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తాజాగా చేరిన నాయకుడి తీరుతో పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలు చోటు చేసుకోనున్నట్లు విశ్వాసనీయ సమాచారం. కొరస ఆనంద్ పార్టీ మారితే పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండడం, వర్గ పోరు , ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అధికార బి ఆర్ ఎస్,భాజాపా పార్టీల వైపు వారు చూస్తున్నట్లు సమాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !