మన్యం న్యూస్ గుండాల: పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజాపందా పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గుండాల తండాలో 50 కుటుంబాలు రెండు వందల మంది ప్రజాపందా పార్టీలో చేరినట్టు ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ వీరి చేరిక ప్రజల ఉద్యమానికి ఉపయోగపడుతుందని ఉద్యమాలతోనే అనేక సమస్యలను పరిష్కరించినట్లు ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించే వారిపై పోరాటాలు చేయక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాచర్ల సత్యం, ఈసం శంకర్, కొమరం శాంతయ్య, వాంకుడోత్అజయ్, వెంకన్న, బిచ్చ, తదితరులు పాల్గొన్నారు
