మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 14
మణుగూరు లో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ మహరాజ్ శోభ యాత్రను, 373వ జయంతి వేడుకలను విజయవంతం చెయ్యాలని మణుగూరు మండల గౌడ సంఘం నాయకులు దొంతగాని కరుణాకర్ గౌడ్ పిలుపునిచ్చారు.మణుగూరు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణాకర్ గౌడ్ మాట్లాడారు.సర్దార్ పాపన్న గౌడ్ శోభ యాత్ర ఈ నెల 18న ఉదయం 10 గంటల కు మణుగూరు సురక్షా బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.పినపాక నియోజకవర్గ గౌడ సోదరులు,మహిళలలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.పూర్తి సమాచారం కొరకు నియోజకవర్గం గౌడ సోదరులు 9440509936 నెంబర్ పై సంప్రదించాలని కరుణాకర్ గౌడ్ కోరారు.