స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రగతి మైదానం రెడీ
* జాతీయ జెండాను ఎగురవేయనున్న ప్రభుత్వ విప్ రేగ కాంతారావు
* ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక
* జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రగతి మైదానం ముస్తాబయింది. మంగళవారం జరిగే జెండా పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక జిల్లా ప్రజలకు 77 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ప్రగతి మైదానంలో కలెక్టర్ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల విద్యార్థులచే నిర్వహించు సాంస్కృతిక కార్యక్రమాలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. స్టాల్స్ పరిశీలించిన కలెక్టర్ ఆయా శాఖల శాఖ పరంగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఐడిఓసి కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ తదుపరి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ప్రగతి మైదానానికి చేరుకోవాలని చెప్పారు. ఉదయం 11 గంటలకు ప్రగతి మైదానంలో ముఖ్యఅతిధి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మసూదన్ రాజ్, ఎఎస్పీ విజయ్ కుమార్, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సంజీవరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, మహిళా సంక్షేమ అధికారి సబిత, బిసి సంక్షేమ అధికారి ఇందిర, ఆర్డిఓ శిరీష, తహసిల్దార్ పుల్లయ్య, ఏఓ గన్యా తదితరులు పాల్గొన్నారు.