రేగా క్యాంప్ కార్యాలయంకు వెళ్లే రహదారి అధ్వానం!
* దిగబడుతున్న ఆటోలు కార్లు బండ్లు
* ఇబ్బంది పడుతున్న వాహనదారులు
* పట్టించుకోని అధికారులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేగా కాంతారావు క్యాంపు కార్యాలయంకు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో చర్చ నియాంశంగా మారింది. స్థానిక చుంచుపల్లి హై స్కూల్ ప్రక్కనున్న ఈ రహదారిపై నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రేగా క్యాంపు కార్యాలయానికి పోవాలన్న ఈ దారి గుండానే పోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంకు రిజిస్ట్రేషన్ కార్యాలయంకు పోవాలన్న ఈ రోడ్డు నుండే పోవాల్సి ఉంటుంది. వివిధ పనుల నిమిత్తం రహదారిపై తవ్వకాలు జరిపి సరిగ్గా పూడ్చకుండా వదిలేయడం వల్ల వాహనాలు దిగబడుతున్నాయి. దిగబడిన వాహనాలను బయటకు తీయాలంటే నానా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ సమస్య గత కొన్ని రోజులుగా ఉన్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో సరైన మరమ్మతులు నిర్వహించి ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.