మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 14
మణుగూరు ఏరియాలో సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్,ప్రాజెక్ట్ జి వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం పర్యటించారు.ఈ సందర్బంగా డైరెక్టర్ ప్లానింగ్,ప్రాజెక్ట్ జి వెంకటేశ్వర రెడ్డి,ఇంచార్జ్ జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య సంబంధిత అధికారులతో కలిసి మణుగూరు ఏరియా లోని పీకే ఓసీ -2,పీకే ఓసీ-4, ఎమ్ఎన్జిఓసి వ్యు పాయింట్,కేసిహెచ్ పి ను సందర్శించారు.ఈ సందర్బంగా డైరెక్టర్ ప్లానింగ్,ప్రాజెక్ట్ జి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, పంపుల పంపింగ్ కెపాసిటీ పెంచుకోవాలి అని,అలాగే ఎక్కువ పంపులు పెట్టి నీటిని బయిటికి పంపించాలని అక్కడ అధికారుకు సూచించారు. అనంతరం ఓసి-4 లో క్వారిలోని కోల్ బెంచ్ ని పరిశీలించి జి -7 గ్రేడ్ బొగ్గు అందుబాటులో వచ్చే అవకాశం ఉన్నందున మెషీన్లు ఉపయోగించి థిక్ సీమ్ నుండి బొగ్గును అందుబాటులో తీసుకోరావాలి అని తెలిపారు.దుర్గా కంపెనీ ఓబి కాంట్రాక్ట్ వారి ద్వారా పనులు త్వరతగతిన పూర్తి చేసి,బొగ్గు ఉత్పత్తికి ఆటంకం లేకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.ఓసి-4 లో ప్రీ-వే బిన్,లారీ కోల్ బంకర్ ఎరక్షన్ కు సంబందించిన పనులను పరిశీలించి,పనులు త్వరగా పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశించారు.అనంతరం కేసిహెచ్ పి లైన్ 4 వ్యాగన్ లోడింగ్ ను సందర్శించి బొగ్గు రవాణా తీరును పరిశీలించారు. కొండాపురం మైన్ నుంచి రోజుకు 600 టన్నులు బొగ్గు ఉత్పత్తి అయ్యేలా చూడాలని సంబంధిత రూఫ్ సపోర్ట్ బొల్టింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జి వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ పీకే ఓసి టి.లక్ష్మీపతి గౌడ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం ఎన్ జి ఓ సి శ్రీనివాస చారి,ఏరియా ఇంజినీర్ నర్సీ రెడ్డి ,ఏజిఎం సివిల్ డి వెంకటేశ్వర్లు,ప్రాజెక్ట్ మేనేజర్ పికేఓసి రాంబాబు,డిజిఎం కేసిహెచ్ పి మధన్ నాయక్,మేనేజర్ ఓసి – 4 డి శ్రీనివాస్,కేపియూజి మేనేజర్ బైరెడ్డి వేంకటేశ్వర రెడ్డి,ఇతర సంబంధిత అధికారులు,సీనియర్ సెక్యూరిటీ అధికారి అబ్దుల్ షబిరుద్దీన్,ఇతర అధికారులు పాల్గొన్నారు.