మన్యం న్యూస్ బూర్గంపహాడ్,(భద్రాచలం):భద్రాచలం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన మల్లా ప్రతాప్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఫిలింనగర్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సోమవారం పరామర్శించి అతని ఆరోగ్య సమస్య గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రతాప్ కి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. సంపత్ కి మేమున్నాం అని మనోధైర్యం ఇచ్చారు. రేగా అనుచరులు,భద్రాద్రి జిల్లా బీ. ఆర్.ఎస్ అధికార ప్రతినిధి షేక్ అన్వర్,వేణు,పూజారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.