UPDATES  

 23నెలల కార్మికుల కష్టార్జితాన్ని ఖజానాలో దాచుకుంటారా..?

23నెలల కార్మికుల కష్టార్జితాన్ని ఖజానాలో దాచుకుంటారా..?

*వేజ్ బోర్డు ఏరియర్స్ చెల్లింపులో జాప్యమెందుకు!

*వర్కర్స్ యూనియన్ నేతలు జి.వీరస్వామి, వంగా వెంకట్
గనులు ఉపరితల విభాగాల కార్యాలయాల ఎదుట నిరసన

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 11వ వేజ్ బోర్డు ఎరియర్స్ డబ్బులు చెల్లించడంలో జాప్యమెందుకని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం ఏరియా కార్యదర్శి జి.వీరస్వామి, కార్పోరేట్ ఏరియా కార్యదర్శి వంగా వెంకట్ ప్రశ్నించారు. యూనియన్ కేంద్ర కమిటి పిలుపులో భాగంగా కొత్తగూడెం ఏరియా, కార్పోరేట్ పరిధిలోని గనులు, ఉపరితల విభాగాల కార్యాలయాల ఎదుట విధుల ప్రారంభ సమయంలో సోమవారం నిరసన తెలిపిన అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు 23నెలలకు సంబందించి వేతనాలు, అలవెన్సులకు సంబందించి 11వ వేజో బోర్డులు పెరిగిన బకాయిలు చెల్లించాల్సి ఉందని రెండేండ్లు కావస్తున్నా యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. కార్మికుల కష్టార్జితాన్ని చెల్లించకుండా ఖజానాలో దాచుకొని నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఎరియర్స్ డబ్బులు యాజమాన్యం అదనంగా చెల్లించేటివి కావని అవి కార్మికు కష్టార్జితమేనన్నారు. కార్మికుల రావాల్సిన డబ్బులు చెల్లించాలని ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వి.మల్లికార్జున్రావు, అన్నెం లక్ష్మి నారాయణ, ఎం.ర్సయ్య, కొదురుపాక రాజేంద్ర ప్రసాద్ ఎస్. వి.రమణ, ఎస్.నాగేశ్వర్రావు, ఎస్ కె.హుమాయున్, టి.శేషగిరిరావు, బండారి మల్లయ్య, గుమ్మడి వీరయ్య, బి. తిరుపతి, జె.గట్టయ్య, గోపికృష్ణ, కె.రాజేశ్వర్రావు, పి. చంద్రయ్య, మధుకృష్ణ, టి.నాగయ్య, పి.సుబ్బారావు, గొంతు శ్రీనివాస్, డి.శ్రీనివాస్, నిర్మల, రంజీత్, రాము, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !