మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
గృహలక్ష్మి పథకంలోని ఇంటి స్థలానికి రిజిస్టర్ పట్టా కావాలనే నిబంధనను రామవరం ప్రాంతానికి సడలింపు ఇవ్వాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన డ్వాక్రా గ్రూపుల మహిళల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు ఎంక్వయిరీల పేరుతో గృహ లక్ష్మీ పథకం అర్హత సాధించాలంటే ఇంటి స్థలానికి రిజిస్టర్ పట్టా కావాలని నిబంధన విధించడం సరికాదని ఆమె విమర్శించారు. ఈ నిబంధన ద్వారా రామవరం ప్రాంత ప్రజలకి గృహలక్ష్మి పథకంలో ప్రభుత్వం తీరని అన్యాయం చేసినట్లు అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ మహిళలు కవిత, సునీత, బేగం, సింధు తదితరులు పాల్గొన్నారు.