UPDATES  

 మాకొద్దు ఎంపీడీవో వాడి వేడిగా మండల సర్వసభ్య సమావేశం

ఎంపీడీవోని సరెండర్ చేయాలనిప్రజాప్రతినిధుల తీర్మానం
మన్యం న్యూస్ గుండాల: గుండాల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముక్తి సత్యం అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశం వాడి వేడిగా సాగింది. పలు శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో సంబంధిత అధికారుల ప్రగతి నివేదిక చర్చించలేదు. అనంతరం ఎంపీపీ ముక్తి సత్యం మండల వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన, జరగాల్సిన అభివృద్ధి పనుల తీరుపై చర్చించారు .అనంతరం విధుల పట్ల అశ్రద్ధ వ్యవహరిస్తున్న ఎంపీడీవో సత్యనారాయణ నుజిల్లాకు సరెండర్ చెయ్యాలని ప్రజాప్రతినిధులు ఏక గ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సమావేశంలో జడ్పిటిసి రామక్క, ఎంపీడీవో సత్యనారాయణ, గుండాల సర్పంచ్ సీతారాములు, ప్రజా ప్రతినిధులు ,వివిధ శాఖలఅధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !