మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంలోని పాత చర్ల మేదరగూడెం వీధికి చెందిన ఏకుల రాంబాబు(50) అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది. కడు పేదరికంమైన కుటుంబం కావడం వలన దాహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా కుటుంబీకుల దగ్గర రూపాయలు లేని పరిస్థితి. బిక్కుబిక్కుమంటున్న కుటుంబాన్ని చూసి చలించి పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ పదివేల రూపాయలు, ఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కాపుల కృష్ణరూ. 4000 ఆర్థిక సహాయాన్ని కుటుంబీకులకు అందించి మానవత్వం చాటుకున్నారు.అలాగే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సైతం సహాయ సహకారాలు అందించారు.
