మన్యం న్యూస్, దుమ్ముగూడెం ఆగస్టు 14:
రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ కమిషన్ లో రెండవ ఏఎన్ఎంలు గా విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులర్ చేయాల ని ఏఐటీయూసీ జిల్లా నాయకులు నోముల రామిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిటి మణిదీప్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు రామిరెడ్డి మాట్లాడుతూ 16 ఏళ్లుగా పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలను న్యాయబద్ధంగా పర్మినెంట్ చేయాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. తమ విధులను బహిష్కరించి ఈ నెల 16 తారీఖు నుండి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు తాటిపూడి రమేష్, ఏఎన్ఎంలు వీరభద్రమ్మ, సమ్మక్క, పూర్ణ, భూదేవి, నరసమ్మ, తిరుపతమ్మ, గంగమ్మ, లక్ష్మి, శ్యామల, తదితరులు పాల్గొన్నారు.