UPDATES  

 కుల వృత్తులకుసీఎం కేసీఆర్‌ కొండంత భరోసా

కుల వృత్తులకుసీఎం కేసీఆర్‌ కొండంత భరోసా
*ఆంధ్ర పాలనలో ధగా పడ్డ బీసీ కులాలు
*ఆర్థిక సహాయం చారిత్రాత్మక నిర్ణయం

*300 మంది బీసీ కుల వృత్తి దారులకు లక్ష సహాయం చెక్కులు పంపిణీ
*చెక్కుల పంపిణీ నిరంతర ప్రక్రియ
*ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 14: ఆంధ్ర పాలనలో దగాపడ్డ కులవృత్తులకు సీఎం కేసీఆర్‌ కొండంత భరోసా అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కులవృత్తుల ఆర్థిక అభివృద్ధిలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా 300 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చెక్కులను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట గిరిజన భవన్ లో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీసీ కులవృత్తులను పట్టించుకోలేదన్నారు.ఆంధ్ర పాలనలో ధగా పడ్డ బీసీ కులాలకు ముఖ్యమంత్రి కెసిఆర్
ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుని పేరుపై లక్ష రూపాయలు అందచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీసీ కులవృత్తిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ప్రతినెలా 300 మందికి సాయమందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 5మండలాల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీ లు, వైస్ ఎంపీపీ లు, ఎంపీటీసీలు, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్ లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !