UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఒకడేమో మంగళగిరి పప్పు- ఇంకొకడేమో..: కడుపుమంటకు ఆరోగ్యశ్రీలో చికిత్స: రోజా సెటైర్ల జాతర

తిరుపతి: పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా.. తిరుపతి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం నగరిలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పుత్తూరులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

పుత్తూరు శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోన్న టిడ్కో ఇళ్లను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

టిడ్కో గృహ సముదాయాల ఆధునికీకరణ పనులను రోజా ప్రారంభించారు. దీనికోసం నాలుగున్నర కోట్ల రూపాయలను వ్యయం చేస్తోంది జగన్ ప్రభుత్వం. అలాగే- నగరిలో నిర్మితమౌతోన్న జగనన్న కాలనీలో మౌలిక వసతుల పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. టిడ్కో ఇళ్ల కాలనీలో మౌలిక వసతులన్నింటినీ పూర్తి చేస్తోన్నామని, అతి త్వరలోనే లబ్ధిదారులు పొజీషన్ సర్టిఫికెట్లను అందజేస్తామని అన్నారు. పేదలకు సొంత ఇంటిని నిర్మించే విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని అన్నారు. వారికి సొంత నివాసం ఉండేలా చర్యలు తీసుకుంటోన్నామని చెప్పారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనప్పటికీ.. ఏ రోజు కూడా వాటిని భారీగా నిధులను ఖర్చు పెట్టిన సందర్భాలు లేవని రోజా విమర్శించారు. పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడుకు గానీ, ఆ పార్టీ నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

అయిదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రాన్ని సమాన అభివృద్ధి చేయలేకపోయాడని ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తాన్నీ ఒక ప్రాంతంలోనే ధారపోయడానికి ప్రయత్నించాడని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని తమ ప్రభుత్వం మాత్రం సమానాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు.

తమ ప్రభుత్వంలో శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోన్న టిడ్కో ఇళ్ల ముందు నిల్చుని టీడీపీ నాయకులు వచ్చి సెల్ఫీలు దిగడాన్ని తప్పుపట్టారు. టీడీపీ హయాంలో ఆ పని ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. ఇప్పుడు పనులు జరుగుతున్నా, త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా సెల్ఫీలు తీసుకుని ఎవరిని మోసం చేస్తారని నిలదీశారు.

ఒకడేమో మంగళగిరి పప్పు ఇంకొకడేమో ఈ నగరి పప్పు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, ఆ పార్టీ నగరి ఇన్‌ఛార్జ్ గాలి భాను ప్రకాష్‌ను ఉద్దేశించి సెటైర్లు సంధించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొంటోన్న చంద్రబాబు కనీసం 40 వేల ఇళ్లను కూడా కట్టలేకపోయాడని అన్నారు.

వైఎస్ జగన్‌కు లభిస్తోన్న ప్రజాదరణ చూసి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కడుపు రగిలిపోతున్నట్లు కనిపిస్తోందని రోజా విమర్శించారు. ఈ కడుపుమంటతోనే పవన్ పోతాడేమోనని భయమేస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీలో కడుపు మంటల పవన్ కల్యాణ్ అనే ప్రొసిజర్ కింద ఆయనను చేర్పించి కడుపుమంట తగ్గించాలని కోరుతామని చురకలు అంటించారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !