మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంలోని ఆరోగ్య సేవలు అందిస్తున్న రెండవ ఏఎన్ఎం లను బేషరత్ గా రెగ్యులర్ చేయాలని డిమాండ్ తో ఆగస్టు 16 నుండి నిరవధిక సమ్మెను మా యొక్క డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తామని తెలంగాణ రాష్ట్ర నేషనల్ హెల్త్ మిషన్ రెండవ ఏఎన్ఎం యూనియన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చర్ల మండల డిప్యూటీ తాసిల్దార్ భరణి బాబు కి వివిధ డిమాండ్ల లతో కూడిన వినతి పత్రాన్ని రెండవ ఏఎన్ఎం.లు అందించడం జరిగింది. అనంతరం ఏఎన్ఎం సరస్వతి మాట్లాడుతూ గత నెలలు 10,11 తేదీలలో 48 గంటల సమ్మె నిర్వహించడం జరిగిందని ఆ సమయంలో వివిధ డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు అందించడం జరిగిందని, 15 రోజుల్లో పరిష్కరిస్తారని ఎదురు చూశాము కానీ 15 రోజుల్లో ఎటువంటి చర్చలకు మమ్మల్ని పిలవలేదు. పరిష్కారం చేయలేదు ఈ కారణంగానే మేము ఈ నెల 16వ తేదీ నుండి నిదవదిక సమ్మె చేయడానికి పూనుకున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని లేనియెడల విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెను చేస్తామన్నారు. మా ప్రధాన డిమాండ్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లందరినీ ఎటువంటి పరీక్షలు లేకుండా బేశరత్ గా రెగ్యులర్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం వారు జులై 10వ తారీఖున విడుదల చేసిన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ నోటిఫికేషన్.2/ 2023.ను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. సరస్వతి, పి. స్వరాజ్యలక్ష్మి , కే.సు మలత. ఎం .ముత్తమ్మ, బీ .సౌజన్య, ఎం .లలిత, ఎస్. కృష్ణవేణి, బి.స్వరూప రాణి ,ఏ. అనసూయ, పి. రాజ్యలక్ష్మి, కె .విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.