వాహనాల తనిఖీ
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండలం కేంద్రం చొక్కాల గ్రామంలో సోమవారం ఎస్ఐ అశోక్ నేతృత్వంలో వాహన తనిఖీలు ముమ్మారంగా జరిగాయి. గత కొన్ని రోజుల నుంచి స్వతంత్ర దినోత్సవం బ్లాక్ డే గా జరుపుకోవాలని మావోయిస్టుల లేఖల వస్తున్న తరుణంలో, వెంకటాపురం మండల పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ క్షుణ్ణంగా పరీక్షిస్తూ స్వతంత్ర దినోత్సవం నాడు ఎటువంటి అగయీ త్యాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. టు వీలర్, ఫోర్ వీలర్ అని తేడా లేకుండా అనుమానా స్పదంగా ఉన్నా వాహనదారులని ఆపి విచారించి పంపిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, శాంతిభద్రతల విషయంలో ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
