మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండల కేంద్రంలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిఆర్పిఎఫ్ పోలీసులు మండల కేంద్రంలోని కిరాణా షాపులో మరియు చిల్లర దుకాణాల యజమానులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ఎంఆర్ఏ గైడన్ ఏఎస్ఐ రామచంద్రు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను తెలుసుకోవాలని స్వతంత్రం కోసం పాటుపడిన వీరులను స్మరించుకోవాలని వారు తెలిపారు. అంతేకాకుండా వారి మరణాల ప్రతిఫలమే మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర మని ఇటువంటి రోజును చాలా ఘనంగా ప్రపంచ నలుమూలకు ప్రజ్వలించేలా జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ పోలీసులతో పాటు సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
