మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 14, జూలూరుపాడు మండలం పాపకొల్లు సబ్ సెంటర్ పరిధిలోని రాజారావు పేట గ్రామంలో సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో 67 మందిని పరీక్షించి వారికి కావలసిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వీరిలో ఇద్దరు జ్వరంతో బాధపడుతున్నట్లు నిర్ధారించి వారి రక్త నమూనాలను సేకరించారు. సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. కార్యక్రమంలో హెచ్ వి రాధిక, ఏఎన్ఎం లు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.