మన్యం న్యూస్ నూగూరు సంజీవరావు
మన్యం న్యూస్ ,నుగూర్ వెంకటాపురం:
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం గ్రామపంచాయతీ కార్యదర్శి కే సంజీవరావు రాష్ట్ర అవార్డుకు ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాదులోని గోల్కొండలో జరిగే 77వస్వాతంత్ర వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చేతుల మీదుగా అవార్డు తీసుకోనున్నారు. కాగ ఇటీవలే ముత్యం ధార జలపాతంలో చిక్కుకుపోయిన 190 మంది పర్యాటకులను క్షేమంగా కాపాడి ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఈ అవార్డుకు ఎన్నికైయ్యారు. అవార్డు అందుకోవడంపై గ్రామపంచాయతీ ప్రజలతోపాటు పలువురు అభినందనలు తెలిపారు.
