మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- బూర్గంపహాడ్ నూతన తహశీల్దారుగా కె.రాజారావును నియమిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.ఇక్కడ ఇప్పటి వరకు పనిచేసిన తహశీల్దార్ భగవాన్ రెడ్డి కొద్దిరోజుల క్రితమే బదిలీపై మహబూబాబాద్ జిల్లా వెళ్లారు.ప్రస్తుతం డిప్యూటీ తహశీల్దార్ ఇన్ చార్జ్ తహశీల్దారుగా వ్యవహరిస్తున్నారు.కాగాబూర్గంపహాడ్ కు బదిలీ అయిన రాజారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.