UPDATES  

 అసలైన స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలు

  • అసలైన స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలు
  • రాష్ట్ర ప్రజలకు 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 14

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతోందన్నారు.ప్రత్యేకరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన అనతి కాలంలో కెసీఆర్ పరిపాలనలో అద్భుత ప్రగతిని సాధించిందని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధి,సంక్షేమాన్ని జోడేడ్లుగా అమలు చేస్తూ, సుపరిపాలన అందిస్తోందన్నారు.తెలంగాణరాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు.ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత విద్యుత్,నీటి సమస్యలను అధిగమించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను నిర్మించుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్లలో దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా,అవతరించిందన్నారు.రైతు బీమా,రైతు బంధు ఆసరా పెన్షన్లు,రైతాంగానికి ఉచిత విద్యుత్,దళిత బంధు, ముఖ్యమంత్రి సహాయనిధి, షాదీ ముబారక్,కల్యాణ లక్ష్మీ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి రక్షిత తాగునీటి సరఫరా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నర్. కేంద్ర ప్రభుత్వం సైతం తెలంగాణ పథకాలను అమలు చేస్తోందన్నారు.రాష్ట్రంలోని ప్రతి గడపగడపకు ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని వారు తెలిపారు.అసలైన స్వాతంత్ర ఫలాలను నేడు తెలంగాణ ప్రజలు ఆస్వాదిస్తున్నారు విప్ రేగా కాంతరావు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !