స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతులను రుణ విముక్తి చేసే దిశగా సీఎం కేసీఆర్.. రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు జారీచేశారు. సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించిన రుణ మొత్తం.. 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇవి రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకులకు చేరనున్నాయి.