UPDATES  

 విద్యార్థుల దాహం తీర్చిన హైకోర్టు న్యాయవాది తీరనున్న మంచినీటి కష్టాలు

 

మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 15, మండల పరిధిలోని కాకర్ల గ్రామ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల మంచినీటి కష్టాలు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో తీరనున్నాయి. గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది హరి శ్రీధర్ స్వగ్రామం కాకర్ల వచ్చిన క్రమంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలోని హై స్కూల్ లో నిర్వహిస్తున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో హై స్కూల్ విద్యార్థులు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న వెంటనే పాఠశాలకు స్వంత ఖర్చులతో వీలైనంత త్వరగా ఆర్వో మినీరాల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేపిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాఠశాల విద్యార్థుల మంచినీటి కష్టాలు తొలగిపోనున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు న్యాయవాది హరి శ్రీధర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల దాహం తీర్చిన శ్రీధర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞత అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, పాఠశాల చైర్మన్ రాచబంటి కృష్ణారావు, గ్రామ పెద్దలు ముత్తినేని రామయ్య, కళ్యాణపు బాలకృష్ణయ్య, రాచబంటి వెంకట నరసయ్య, కళ్యాణపు వెంకటప్పయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !