మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 15
మణుగూరు మండలం లోని కూనవరం గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి అధ్యక్షతన 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఏనిక.ప్రసాద్ జాతీయ జెండా ను ఎగురవేశారు.ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్రం కోసం అమరులైన వారి స్ఫూర్తితో దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,ఎంపీటీసీలు గుడిపూడి కోటేశ్వరరావు, మచ్చ సమ్మక్క,వార్డు మెంబర్లు మేకల మాధవి,పొదెం రమాదేవి,మిట్టపల్లి కిరణ్,కో ఆప్షన్ సభ్యులు బుద్ధరాజు నరసింహారాజు,అంచ వెంకట్రావు,ఆకారపు కళావతి, పిసా సభ్యులు మడకం రమేష్, మాజీ ఎంపీటీసీ రమణ,ఆశా వర్కర్లు నర్సులమ్మ,విజయ, కుమారి,అంగన్వాడీలు,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.