మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 15
మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రి లో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ ప్రసాద్ జాతీయ జెండా ఎగురవేశారు.ఈ సందర్బంగా సూపరింటెండెంట్ మాట్లడుతూ ఆసుపత్రి సిబ్బంది క్రమశిక్షణ తో పనిచేయాలని సూచించారు ఆసుపత్రి ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగుపడిందని అన్నారు. ఆసుపత్రి లో కాన్పుల సంఖ్య చాలా పెరగింది అని సంతోషం వ్యక్తం చేశారు.మోకాలు కీలు మార్పిడి,గొంతు ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడం పట్ల డాక్టర్లను, నర్సింగ్ సిబ్బందిని వారు అభినందించారు.మణుగూరుప్రాంత ప్రజలకు ఆసుపత్రి పట్ల నమ్మకం పెరిగిందన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రామ్ ప్రసాద్,అర్.ఏం.వోలు డా.సునీల్ డా.నరేష్,డాక్టర్ లు, ఆనంద రావు,వీరశేకర్,నిఖిల్, కృష్ణ,మౌనిక,నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ సూపర్వైజర్ సిద్దెల తిరుమల రావు,సాయి వివేక్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.