UPDATES  

 త్యాగాల ఫలితమే స్వాతంత్రం         

త్యాగాల ఫలితమే స్వాతంత్రం

గణేష్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

మన్యం న్యూస్ చర్ల:
త్యాగాల ఫలితమే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి పేర్కొన్నారు శ్రీ గణేష్ ఆటో డ్రైవర్స్ మరియు ఓనర్స్ యూనియన్ చర్ల మండల అధ్యక్షులు పామర్ బాలాజీ కార్యదర్శి సంపత్ పేర్కొన్నారు. 77వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీ గణేష్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చర్ల బస్టాండ్ సెంటర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు పామర్ బాలాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు కెవిపిఎస్ మండల కార్యదర్శి మచ్చా రామారావు ఐద్వా మండల కార్యదర్శి పొడుపు గంటి సమ్మక్క కెవిపిఎస్ నాయకులు వాళ్ల వినోద్ డివైఎఫ్ఐ మండల కార్యదర్శి నరేందర్ శ్రీ గణేష్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ సిఐటియు కమిటీ నాయకులు వల్లెపోగు విజయ్ కంచర్ల సతీష్ దొంతు ప్రసాద్ రాచకొండ సంజీవ్ కొమ్మనాపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !