ఎస్పీ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు తమ విలువైన జీవితాలను, ప్రాణాలను త్యాగం చేయడం వలనే దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు. ఆ మహనీయులను స్మరించుకుందాం అని పేర్కొన్నారు. ఎంతో మంది త్యాగధనుల పుణ్యఫలం,అవిశ్రాంత పోరాటాల తర్వాత స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ టి.సాయి మనోహర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, భద్రాచలం ఏఎస్పీ వారితోష్ పంకజ్,పాల్వంచ డిఎస్పి వెంకటేష్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, ఇల్లందు డిఎస్పి రమణ మూర్తి, డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, సిఐ వెంకటేశ్వర్లు, ఏవో జయరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు, రాజువర్మ, ఆర్ఐలు అడ్మిన్ ఆర్ఐ రవి, ఎంటిఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, హోంగార్డ్స్ ఆర్ఐ నరసింహారావు, ఆర్ఐ ఆపరేషన్స్ లాల్ బాబు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.