మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 15, 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండల ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు, విద్యాలయాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాలతో పాటు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, యువజన సంఘాల నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి, తమ దేశభక్తిని చాటారు. స్వతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం అర్పించిన మహనీయుల త్యాగాలను కొనియాడారు. వారి చిత్రపటాలకు పూలమాల లేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి, ఒకరికొకరు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినదించారు.