జర్నలిస్టులు సామాజిక సేవలపై దృష్టి పెట్టాలి
జిల్లా సమాచార శాఖ అధికారి శీలం శ్రీనివాస్
ఘనంగా ప్రెస్ క్లబ్ లో పంద్రాగస్టు వేడుకలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
జర్నలిస్టు మిత్రులు సామాజిక సేవలపై దృష్టి పెట్టాలని భద్రాద్రి జిల్లా సమాచార శాఖ అధికారి శీలం శ్రీనివాసరావు అన్నారు. సామాజిక సేవలు అందించినప్పుడే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. మంగళవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగూడెం ప్రెస్ క్లబ్ లో సమాచార శాఖ అధికారి శీలం శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేశారు. సమాజంలో సేవకే మంచి గుర్తింపు ఉందని ఆ సేవ తత్వాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకొని ముందుకు పోతే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.