మన్యం న్యూస్, బూర్గంపహాడ్: మండల పరిధిలోని మోతే పట్టినగర్ గ్రామ సమీపంలోని సమ్మక,సారక్క ల గద్దేల సమీపంలోని బ్రిడ్జి మీద ఓ కర్ర ట్రాక్టర్ మంగళవారంపల్టీ కొట్టింది.ట్రాక్టర్ బ్రిడ్జి డివైడర్ ని గుద్ది,బ్రిడ్జి పైనే ఓ ప్రక్కకు ఒరిగింది, అదృష్టవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ కి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు.మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.కర్ర ట్రాక్టర్ పల్టీ వేయడంతో ట్రాక్టర్ లోని జామాయిల్ కర్ర మొత్త చిందర వందర గా రోడ్డు పై పడడంతో,స్థానిక పోలీసులు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొని కర్రను స్థానికుల సహాయంతో పక్కకు నెట్టారు.
